Telangana: కుటుంబ కమిషన్ల కోసమే తెలంగాణలో పాలన జరుగుతోంది: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

  • నిధులిస్తే టీఆర్ఎస్ నేతల కమిషన్లకు సరిపోవడం లేదు
  • ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం
  • కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ కొనుగోలు చేశారు

2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రూ.లక్ష కోట్లకు పైగా కేంద్రం నిధులిస్తే టీఆర్ఎస్ నేతల కమిషన్లకు అవి సరిపోవడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇక ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేదని ఆరోపించారు. డబ్బు ప్రలోభాలకు గురి చేసి, మహిళలను భయపెట్టి, కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ కొనుగోలు చేసి ఎన్నికల్లో గెలిచారని ఆయన విమర్శించారు. కేవలం కుటుంబ కమిషన్ల కోసమే పాలన జరుగుతోందని, కేసీఆర్ సహా కింది స్థాయి నేతల వరకూ అందరూ అబద్ధాల కోరులని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఉద్యమంలో పాల్గొన్న వారిని తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టిందని, నేడు తెలంగాణ వ్యతిరేకులు 70 శాతం మంది టీఆర్ఎస్ కేబినెట్‌లో ఉన్నారని అరవింద్ ఆరోపించారు.

More Telugu News