BJP: ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తాం: జేడీయూ

  • పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న బీజేపీ
  • రాజ్యసభలో బిల్లును వ్యతిరేకిస్తామని జేడీయూ స్పష్టం
  • ముస్లింలలో చైతన్యం తీసుకురావాలని సూచన

ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆదిలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంటే.. దానిని అడ్డుకునేందుకు జేడీయూ సిద్ధమవుతోంది. సీనియర్ జేడీయూ నేత, బీహార్ మంత్రి షయం రజాక్ ట్రిపుల్ తలాక్ బిల్లు విషయమై స్పందిస్తూ, రాజ్యసభలో తమ పార్టీ ఆ బిల్లును వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.

అదొక సున్నిత అంశమని, ఈ సమస్య పరిష్కారానికి ముస్లింలలో చైతన్యం తీసుకురావడానికి యత్నించాలని ఆయన కేంద్రానికి సూచించారు. అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించారు. ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ, అయోధ్యలో రామమందిరం నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలను చర్చల రూపంలో కానీ, కోర్టు ఆదేశాల ద్వారా కానీ పరిష్కరించుకోవాలన్నారు.

More Telugu News