rajasekhar: హుషారెత్తిస్తోన్న 'కల్కి' ఐటమ్ సాంగ్

  • విభిన్న కథా చిత్రంగా 'కల్కి'
  • మాస్ మసాలా సాంగ్ ను వదిలిన టీమ్
  •  ఈ నెల 28న సినిమా విడుదల  

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా 'కల్కి' సినిమా రూపొందింది. ఆదాశర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి, తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగును వదిలారు. "నీ లోడు బండి ఆపేయ్ రా .. వేడిమీద ఇంజనుంది దించేయ్ రా .. ఈ రోడ్డు నా అడ్డారా .. సల్లదాగి సల్లగయ్యి పోవేరా " అంటూ ఈ పాట సాగుతోంది.

ప్రత్యేకంగా వేసిన 'దాబా' సెట్లో చిత్రీకరించిన ఐటమ్ సాంగ్ ఇది. రాజశేఖర్ బుల్లెట్ పై వెళుతూ ఒక 'దాబా'లోకి ఎంట్రీ ఇవ్వగా, స్కార్లెట్ విల్సన్ బృందంపై ఈ పాటను చిత్రీకరించారు. శరవణ్ భరద్వాజ్ సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యం .. లలిత హవ్య ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. మాస్ ఆడియన్స్ ను హుషారెత్తించడం కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తుంటారు. ఆ విషయంలో ఈ సాంగ్ కి మంచి మార్కులు పడటం ఖాయమేననిపిస్తోంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News