surya: విలన్ గా సూర్యతో తలపడుతున్న మోహన్ బాబు

  • సుధా కొంగర నుంచి 'సూరరై పోట్రు'
  • చెన్నై ఎయిర్ పోర్టులో షూటింగ్ 
  • ఆల్రెడీ అక్కడికి చేరుకున్న మోహన్ బాబు

తెలుగు తెరపై విలక్షణ నటుడిగా మోహన్ బాబు సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. 500 చిత్రాలకి పైగా చేసిన ఆయన, ఇటీవల కాలంలో అడపాదడపా మాత్రమే నటిస్తూ వస్తున్నారు. అలాంటి మోహన్ బాబు .. త్వరలో వెండితెరపై మళ్లీ విలన్ గా కనిపించనున్నారు. తమిళంలో సూర్య కథానాయకుడిగా సుధా కొంగర ఒక సినిమా చేస్తోంది.

'సూరరై పోట్రు' టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో విలన్ పాత్ర విలక్షణంగా వుంటుందట. అందువల్లనే మోహన్ బాబును దర్శక నిర్మాతలు సంప్రదించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయిది. చెన్నై ఎయిర్ పోర్టులో మోహన్ బాబు కాంబినేషన్లోని సన్నివేశాలను రేపు చిత్రీకరించనున్నారట. అందువల్లనే మోహన్ బాబు నిన్ననే అక్కడికి వెళ్లారని చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగులో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News