జగన్ సీఎంగా వున్న శాసనసభలో అడుగుపెట్టడం సంతోషంగా ఉంది: జనసేన ఎమ్మెల్యే

12-06-2019 Wed 19:44
  • శాసనసభలో జనసేన వాణిని వినిపిస్తా
  • వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందా
  • జనసేన నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటుంది
జనసేన తరుపున శాసనసభకు గెలిచిన ఏకైక అభ్యర్థి రాపాక వరప్రసాద్ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, శాసనసభలో జనసేన వాణిని వినిపిస్తానన్నారు. తాను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి విజయం సాధించానని, ప్రస్తుతం ఆయన తనయుడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు మరోసారి శాసనసభలో అడుగు పెడుతున్నానని తెలిపారు. జనసేన పార్టీ శాసనసభలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటుందని వరప్రసాద్ తెలిపారు.