maoists: విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు

  • తప్పించుకున్న మావోయిస్టులు
  • భారీగా డంప్‌ స్వాధీనం
  • విశాఖ, తూర్పుగోదావరి సరిహద్దుల్లో ఘటన

విశాఖ, తూర్పుగోదావరి సరిహద్దు ఏజెన్సీలో ఈరోజు ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటన నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారని, భారీ ఎత్తున డంప్‌ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే...విశాఖ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా సరిహద్దులోని చొప్పకొండ, బురదకోట ప్రాంతంలో మావోయిస్టులు ఎదురు పడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య దాదాపు 48 నిమిషాలపాటు కాల్పులు జరిగాయి. అనంతరం మావోయిస్టులు తప్పించుకుని పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు ఘటనా స్థలిలో పరిశీలించి 303 తుపాకులు, ఆరు కిట్‌ బ్యాగులు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News