Errabelli: నిధుల మంజూరు కోరుతూ కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించిన ఎర్రబెల్లి

  • రూ.760 కోట్ల నిధులు మంజూరు చేయాలి
  • అంత్యోదయ మిషన్‌ను అమలు చేస్తున్నాం
  • గ్రామస్వరాజ్ అభియాన్ కింద రూ.175 కోట్లు

పంచాయతీ భవనాల నిర్మాణంతోపాటు మరమ్మతులు, సాంకేతిక సామగ్రికి నిధులు కావాలని, ఉపాధి హామీ కింద రూ.760 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమార్‌ను తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. నేడు కేంద్ర మంత్రిని కలిసిన ఎర్రబెల్లి రాష్ట్రంలో అభివృద్ధి పథకాలకు నిధుల మంజూరు కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

ఎస్సీ, ఎస్టీల జనాభా 40 శాతం ఉన్న నేపథ్యంలో తెలంగాణలో అంత్యోదయ మిషన్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ కింద రూ.175 కోట్ల నిధులు, 14వ ఆర్థిక సంఘం పెర్ఫార్మెన్స్ గ్రాంట్ కింద రూ.119 కోట్లు, గ్రాంట్ కింద మరో రూ.135 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రికి ఎర్రబెల్లి విన్నవించారు.

More Telugu News