West Bengal: పశ్చిమబెంగాల్ ను గుజరాత్ గా మార్చే కుట్ర జరుగుతోంది.. నేను ఒప్పుకోను!: మమతా బెనర్జీ

  • రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులున్నాయన్న గవర్నర్
  • ఘాటుగా స్పందించిన పశ్చిమబెంగాల్ సీఎం
  • గవర్నర్ కూ హద్దు ఉంటుందని వ్యాఖ్య

పశ్చిమబెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆ రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. కోల్ కతాలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘నేను గవర్నర్ ను గౌరవిస్తాను. కానీ ప్రతీ పదవికి రాజ్యాంగబద్ధమైన హద్దు అనేది ఉంటుంది. బెంగాల్ ప్రతిష్టను కొందరు దెబ్బతీస్తున్నారు. మీకు(గవర్నర్ కు) నిజంగా పశ్చిమబెంగాల్ ను, దాని సంస్కృతిని కాపాడాలని ఉంటే నాతో కలిసి రండి. బెంగాల్ ను గుజరాత్ గా మార్చేందుకు కుట్ర జరుగుతోంది. బెంగాల్ ఎన్నటికీ గుజరాత్ కాదు’ అని స్పష్టం చేశారు. 

More Telugu News