Andhra Pradesh: ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలే!: ఏపీ హోంమంత్రి సుచరిత వార్నింగ్

  • పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం
  • 24 గంటల పనిభారాన్ని తగ్గించడానికి చర్యలు
  • గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఏపీ హోంమంత్రి

రాజకీయ ప్రతీకార దాడులు అన్నవి మంచివి కాదని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఎవరైనా హింసకు దిగితే, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పోలీసులపై 24 గంటల పనిభారాన్ని తగ్గించడాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరులోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో ఈరోజు సుచరిత మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. అంతకుముందు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తో హోంమంత్రి సుచరిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు సంబంధించిన పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు. కాగా, డీజీపీ కార్యాలయాన్ని సందర్శించాలని గౌతమ్ సవాంగ్ కోరగా, అందుకు హోంమంత్రి సానుకూలంగా స్పందించారు.

More Telugu News