Punzab: 150 అడుగుల లోతైన బోరు బావి, 109 గంటల శ్రమ... మృత్యుంజయుడు!

  • పంజాబ్ లోని బావిలో పడ్డ ఫత్వీర్ సింగ్
  • నాలుగున్నర రోజుల పాటు సహాయకచర్యలు
  • బయటకు తీసి ఆసుపత్రికి తరలింపు

పంజాబ్ లోని బోరు బావిలో పడిన రెండేళ్ల చిన్నారి మృత్యుంజయుడిగా బయటకు వచ్చాడు. 5 రోజుల క్రితం ఆడుకుంటూ వెళ్లి మూతలేని బోరుబావిలో చిన్నారి ఫత్వీర్ సింగ్ ప్రమాదవశాత్తూ పడిపోగా, విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు, బాలుడిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ప్రారంభించాయి. బాలుడు 150 అడుగుల లోతున ఉన్నాడని తెలుసుకున్న అధికారులు, సీసీ కెమెరాలను పంపి బాలుడు ప్రాణాలతోనే ఉన్నాడని గుర్తించారు. ఆపై అతనికి ఆక్సిజన్ పంపుతూ, నాలుగున్నర రోజుల పాటు వెలికితీసే ప్రయత్నాలు చేయగా, అవి గత రాత్రి ఫలించాయి. బావికి సమాంతరంగా గోతిని తవ్విన ఎన్డీఆర్ఎఫ్, ప్రాణాలతో ఉన్న బాలుడిని బయటకు తెచ్చాయి. బాలుడు అపస్మారక స్థితిలో ఉండటంతో, వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.

More Telugu News