Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • స్పెయిన్ వెళ్లిన కీర్తి సురేశ్ 
  • 'డిస్కో రాజా'తో అల్లరి నరేశ్ 
  • సమంత సరదా సమాధానం  

*  కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ ఎల్లుండి నుంచి స్పెయిన్ లో జరుగుతుంది. ఇందుకోసం యూనిట్ బయలుదేరి వెళ్లింది. అక్కడి వివిధ లొకేషన్లలో 45 రోజుల పాటు ఈ షూటింగ్ చేస్తారు. నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు.
*  ఇటీవల 'మహర్షి' సినిమాలో ఓ స్పెషల్ కేరక్టర్ పోషించిన అల్లరి నరేశ్ తాజాగా మరో చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. రవితేజ నటిస్తున్న 'డిస్కో రాజా' సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నాడు. ఈ విషయాన్ని నరేశ్ కన్ఫర్మ్ చేశాడు.
*  అందాలతార సమంత తల్లి కాబోతోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదనే విషయాన్ని సమంత సరదాగా చెబుతూ, 'సమంత నిజంగానే తల్లి కానుందా.. ఆ విషయాన్ని మీరు కనుక్కుంటే కనుక నాకూ చెప్పండి..' అంటూ ట్వీట్ చేసింది.   

More Telugu News