sushma swaraj: ఏపీ గవర్నర్‌గా సుష్మాస్వరాజ్ అంటూ వార్తలు.. నిజం కాదన్న సీనియర్ నేత!

  • తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు అంటూ ప్రచారం
  • సుష్మకు అభినందనలు చెప్పి నాలుక్కరుచుకున్న కేంద్రమంత్రి
  • ఆ వార్తల్లో నిజం లేదన్న సుష్మ

తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్‌లను నియమించబోతున్నారంటూ నిన్నటి నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ భేటీ అయిన తర్వాత ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ ఏపీ గవర్నర్‌గా రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.

రాత్రి పదిగంటలకు కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఓ ట్వీట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన సుష్మాస్వరాజ్‌కు అభినందనలు అని పేర్కొన్నారు. దీంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. అయితే, ఆ తర్వాత కాసేపటికే మంత్రి తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. మరోపక్క, తాను ఏపీ గవర్నర్‌గా నియమితులైనట్టు వచ్చిన వార్తలపై సుష్మ స్వయంగా స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు.  

More Telugu News