BMW: బీఎండబ్ల్యూ కారు కొన్నా పెట్రోల్ కు డబ్బుల్లేక ఓ రైతు చేతివాటం!

  • కోళ్లు, బాతులు దొంగిలిస్తున్న వైనం
  • దొంగతనాలకు బీఎండబ్ల్యూ కారులో రాక
  • అరెస్ట్ చేసిన పోలీసులు

విలాసవంతమైన కార్లలో బీఎండబ్ల్యూకు ఉండే దర్పం, రాజసం మరే కారుకు ఉండవని అభిమానులు విశ్వసిస్తారు. చైనాలోని ఓ రైతు కూడా అలాగే భావించాడు. ఉన్న ఆస్తినంతా అమ్మి చూడముచ్చటగా ఉన్న ఓ బీఎండబ్ల్యూ లేటెస్ట్ మోడల్ కారును కొన్నాడు. దాని ఖరీదు రూ. 2 కోట్లు. ఉన్నదంతా ఊడ్చి కారునైతే కొన్నాడు కానీ, పెట్రోల్ కు డబ్బుల్లేక గిజగిజలాడిపోయాడు. దాంతో, సిచువాన్ ప్రాంతంలో చిన్నచితకా దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు.

ఇళ్ల వద్ద తిరుగుతుండే కోళ్లు, బాతులను దొంగలించి, వాటిని మరో ప్రాంతంలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో తన బీఎండబ్ల్యూ కారుకు పెట్రోల్ కొట్టించేవాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, కోళ్ల దొంగతనాలకు మనోడు బీఎండబ్ల్యూ కారులోనే వచ్చేవాడు. ఓసారి అతడి వాలకం చూసి అనుమానించిన పోలీసులు వెంటాడే ప్రయత్నం చేశారు. కానీ తన బీఎండబ్ల్యూ కారులో రాకెట్ వేగంతో దూసుకెళ్లి ఇంట్లో పడ్డాడు. అయితే, సీసీటీవీ ఫుటేజి పరిశీలించి, నేరుగా ఆ రైతును ఇంటి వద్దే అరెస్ట్ చేశారు పోలీసులు.

More Telugu News