pm: మోదీ మేఘాల వ్యాఖ్యలపై ఒవైసీ మళ్లీ సెటైర్లు!

  • ఈ నెల 3న అదృశ్యమైన ఏఎన్-32 విమానం
  • దాని ఆచూకీ గురించి మోదీని అడిగితే సరిపోయేది
  • ఐఏఎఫ్ ప్రకటించిన రూ.5 లక్షల బహుమతి ఆదా అయ్యేదిగా: అసదుద్దీన్ ఒవైసీ

సర్జికల్ స్ట్రయిక్స్ జరిగిన రోజున దట్టంగా అలముకున్న మేఘాల వల్లే పాకిస్థాన్ రాడార్లు మన యుద్ధ విమానాలను కనిపెట్టలేకపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు కురిపించిన వ్యంగ్యాస్త్రాలు కొదవలేదు. తాజాగా, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోమారు సెటైర్లు విసిరారు.

ఓ బహిరంగ సభలో అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్-32 విమానం ఈ నెల 3న అదృశ్యమైన సంఘటన గురించి ప్రస్తావిస్తూ నాడు మోదీ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. ఈ విమానం ఆచూకి చెప్పిన వారికి రూ.5 లక్షలు బహుమతిగా ఇస్తామని భారత వైమానిక దళం ప్రకటించిందని, అదృశ్యమైన ఆ విమానం ఆచూకీ గురించి మోదీని అడిగితే సరిపోయేదని, ఆ ఐదు లక్షలు ఆదా అయ్యేవని సెటైర్లు విసిరారు. యుద్ధ విమానాలను రాడార్లు కనిపెట్టకుండా తప్పించుకోవడానికి మేఘాలు సాయం చేస్తాయన్న మోదీ ఓ మంచి శాస్త్రవేత్త అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 

More Telugu News