Virat Kohli: ఎన్నో మధురస్మృతులను ఇచ్చావు పాజీ... యువీ రిటైర్మెంట్ పై కోహ్లీ స్పందన

  • యువీ ఓ తిరుగులేని చాంపియన్
  • అద్భుతమైన కెరీర్ తో దేశానికి సేవలందించాడు
  • యువీ జీవితం ఆనందమయంగా సాగిపోవాలి

ఒకప్పుడు డాషింగ్ బ్యాట్స్ మన్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపించిన యువరాజ్ సింగ్ కాలక్రమంలో ప్రాభవం కోల్పోయాడు. క్యాన్సర్ వ్యాధిని యువీ జయించినా, ఆ వ్యాధి కారణంగా యువీ కెరీర్ మాత్రం తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. దాంతో, అంతర్జాతీయ క్రికెట్లో ఇక తన పునరాగమనం కష్టమని భావించిన ఈ పంజాబ్ క్రికెటర్ ఆటకు వీడ్కోలు పలికాడు. ఇవాళ తీవ్ర భావోద్వేగాల నడుమ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పాడు.

యువీ రిటైర్ అవుతున్నట్టు తెలియగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "ఎన్నో చిరస్మరణీయ విజయాలు, మరెన్నో మధురస్మృతులను మాకందించావు పాజీ! అద్భుతమైన కెరీర్ తో దేశానికి సేవలు అందించావు, నీకు శుభాభినందనలు. నీ జీవితం ఆనందమయంగా సాగిపోవాలంటూ కోరుకుంటున్నాను. నువ్వు తిరుగులేని చాంపియన్ యువీ" అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

More Telugu News