saidharam tej: మెగా హీరో కొత్త సినిమాకి టైటిల్ ఖరారు

  • మారుతి దర్శకత్వంలో తేజు 
  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే కథ
  •  త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు 

సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం .. మారుతి దర్శకత్వంలో రూపొందనుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ కథ కొనసాగనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి 'భోగి' అనే టైటిల్ ను పరిశీలించారు. అయితే ఈ టైటిల్ కి బయట నుంచి మంచి ఫీడ్ బ్యాక్ రాలేదట.

దాంతో సినిమా యూనిట్ అంతా కలిసి 'ప్రతిరోజు పండగే' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. టైటిల్ విషయంలో దర్శక నిర్మాతలతో పాటు, సాయిధరమ్ తేజ్ కూడా సంతృప్తితో వున్నాడని అంటున్నారు. ఇంతకుముందు చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాలో తేజు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడని చెబుతున్నారు. కథానాయికల ప్రక్రియను పూర్తిచేసే పనిలో మారుతి వున్నాడని అంటున్నారు.

More Telugu News