ఏపీ కొత్త మంత్రులకు ఫోన్ కాల్స్ తలనొప్పి... ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైనం!

10-06-2019 Mon 12:05
  • సామాజిక మాధ్యమాల్లో వారి ఫోన్‌ నంబర్లు
  • దీంతో వరుసగా వస్తున్న కాల్స్ తో చికాకు
  • లైక్‌లు, కామెంట్లతోనూ అమాత్యులకు ఇబ్బంది

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి నలభై ఎనిమిది గంటలు గడవ లేదు. అప్పుడే మంత్రులకు కొత్త తలనొప్పి మొదలయ్యింది. సామాజిక మాధ్యమాల్లో వారి ఫోన్‌ నంబర్లు ప్రత్యక్షం కావడంతో తలలు పట్టుకుంటున్నారు. ఎక్కెడెక్కడ నుంచో ఫోన్లు, లైక్‌లు, కామెంట్లు...ఇలా వరుస పెట్టి వస్తుండడంతో తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడెక్కడి వారో ఫోన్‌ చేసి అభినందించడం, సలహాలు ఇవ్వడం, సమస్యలు చెబుతుండడంతో ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతున్నారు. ఫోన్‌ మోత భరించలేక కొందరు అమాత్యులు స్వీచ్చాఫ్‌ చేసేశారట. ప్రమాణస్వీకారం చేసి తొలి కేబినెట్‌ సమావేశానికి హాజరైన సమయంలో మంత్రులకు ఇదో తలనొప్పిగా మారింది.