anand devarakonda: మనసుకు పట్టేస్తోన్న 'దొరసాని' లిరికల్ వీడియో సాంగ్

  • మరో ప్రేమకథగా రానున్న 'దొరసాని'
  • హీరోహీరోయిన్ల తొలిపరిచయం
  •  ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం 

తెలుగు తెరకు మరో ప్రేమకథను పరిచయం చేయడానికి 'దొరసాని' సిద్ధమవుతోంది. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ద్వారా జీవితా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక .. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ పరిచయమవుతున్నారు. మధుర శ్రీధర్ - యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

"నింగిలోని పాలపుంత నవ్వులొంపెనే .. నేలపైన పాలపిట్ట తొవ్వగాసెనే .." అంటూ ఈ పాట సాగుతోంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం .. గోరెటి వెంకన్న సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. తెలంగాణ ప్రాంతంలోని ఒకనాటి గడీలు .. ఓ గడీకి చెందిన అమ్మాయిని ఒక సాధారణ యువకుడు ప్రేమించడం .. దాని పర్యవసానాలతో ఈ కథ సాగుతుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

More Telugu News