Australia: ఆస్ట్రేలియాపై గెలవడంతో రికార్డులకెక్కిన కోహ్లీ సేన

  • ఆస్ట్రేలియాపై వన్డేలో భారత్‌కు ఇది 50వ విజయం
  • ఇంగ్లండ్, విండీస్‌లు తొలి రెండు స్థానాల్లో
  • ఆసీస్ పది వరుస విజయాలకు భారత్ కళ్లెం

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం కెన్నింగ్టన్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన భారతజట్టు మరో ఘనతను అందుకుంది. ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది వరసగా రెండో విజయం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 352 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా, లక్ష్య ఛేదనలో ఆసీస్ 316 పరుగులకే ఆలౌటై 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు ఆస్ట్రేలియా పది వరుస విజయాలకు కళ్లెం వేసింది. అంతేకాదు, వన్డేల్లో ఆస్ట్రేలియాపై 50 విజయాలు సాధించిన మూడో జట్టుగా రికార్డులకెక్కింది. భారత్ కంటే ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్‌లు ఈ ఘనత సాధించాయి. కాగా,  ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో గతంలో మూడుసార్లు భారత్ విజయం సాధించింది.

1983లో చెమ్స్‌ఫోర్డ్‌లో 118 పరుగుల తేడాతో గెలుపొందింది. 1987లో ఢిల్లీలో 56 పరుగుల తేడాతో విజయం సాధించగా, 2011లో అహ్మదాబాద్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. తాజాగా కంగారూలపై నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం లండన్‌లో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

More Telugu News