Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'సైరా' షూటింగ్ పూర్తి చేసిన అనుష్క  
  • రాత్రి వేళల్లో 'సాహో' సీన్స్ చిత్రీకరణ   
  • మూడు దేశాల్లో అజిత్ సినిమా షూటింగ్

*  చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'సైరా' చిత్రంలో అందాలతార అనుష్క ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం గత వారం రోజులు ఆమె షూటింగు చేసింది. తాజాగా ఆమె పార్ట్ పూర్తయిందట. దీంతో ఆమె 'సైలెన్స్' చిత్రం షూటింగులో పాల్గొనడానికి త్వరలో అమెరికా వెళ్లనుంది.
*  ప్రభాస్ హీరోగా సుజిత్ రూపొందిస్తున్న 'సాహో' చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో జరుగుతోంది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటపై వీటిని హైదరాబాదులోని ఓ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. ఆగస్టు 15న ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
*  తమిళ హీరో అజిత్ నటించే 60వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీకపూర్ నిర్మించే ఈ చిత్రం షూటింగును మూడు దేశాల్లో నిర్వహిస్తారట. 

More Telugu News