Pawan Kalyan: ఆయనంటే ఏపీ పాలకులకు భయం ఉందేమో కానీ నాకు లేదు: పవన్ కల్యాణ్

  • జగన్ పై సెటైర్ వేసిన జనసేనాని!
  • నాకు స్వార్థం లేదు
  • నన్నెవరూ బెదిరించలేరు

ఆంధ్రప్రదేశ్ లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపించడమే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. మంగళగిరిలో పార్టీ సమీక్ష సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలంటే కష్టనష్టాలుంటాయని, సమాజ శ్రేయస్సు కోరుకున్నవాడ్ని కాబట్టే ప్రజల కోసం నిలబడ్డానని స్పష్టం చేశారు.

"బీజేపీ పక్షాన చేరొచ్చు కదా అని కొందరు అడిగారు. వాళ్లకు చెప్పేదొక్కటే. నాకు బీజేపీతో గానీ, ప్రధాని మోదీతో గానీ వ్యక్తిగత వైరం ఏమీలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, హక్కుల గురించి అడిగానంతే. ఇవాళ ఏపీని పాలిస్తున్న వ్యక్తులకు మోదీ అంటే భయం ఉంటుందేమో కానీ, పవన్ కల్యాణ్ కు మాత్రం భయంలేదు. మోదీ అంటే గౌరవం మాత్రమే ఉంది. నాకు స్వార్థంలేదు కాబట్టి నన్నెవరూ బెదిరించలేరు. నా చివరిశ్వాస వరకు ప్రజలకోసమే ఉంటాను. నేను ఇక్కడ ఉన్నది సినిమాలు చేయడానికి కాదు. ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం. పనిచేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు. ఫలితాలు, పదవి నావెంట పరిగెత్తుకుని రావాలి" అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

కాగా, పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో ఏపీ పాలకులు అంటూ జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోంది. జగన్ కేసుల భయంతోనే మోదీకి విధేయత ప్రకటిస్తున్నాడని ఆయన రాజకీయ ప్రత్యర్థులు తరచుగా విమర్శిస్తుండడం తెలిసిందే.

More Telugu News