Tollywood: ఈ నెల 28న ‘కల్కి’ విడుదల

  • రాజశేఖర్, అదా శర్మ జంటగా నటించిన చిత్రం ‘కల్కి’
  • ‘కల్కి’ పూర్తి కమర్షియల్ చిత్రం
  • త్వరలోనే ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహిస్తాం

ప్రముఖ హీరో రాజశేఖర్, అదా శర్మ జంటగా నటించిన ‘కల్కి’ చిత్రం ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర నిర్మాత సి.కల్యాణ్ వెల్లడించారు. హైదరాబాద్ లో ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘కల్కి’ పూర్తి కమర్షియల్ చిత్రం అని, కొత్త తరహాలో ఉంటుందని అన్నారు. త్వరలోనే ఈ చిత్రం పాటలను విడుదల చేసి, ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్, టీజర్ విడుదల చేశామని, మంచి స్పందన వచ్చిందని అన్నారు.అనంతరం, జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని, రాజశేఖర్ ఇమేజ్ కి తగిన విధంగా, కొత్త తరహా సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించారని అన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ కల్గిస్తుందో, ‘కల్కి’ చిత్రం కూడా అంతే ఉత్కంఠ కలిగిస్తుందని చెప్పారు.

More Telugu News