agri gold: సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి: ముప్పాళ్ల నాగేశ్వరరావు

  • విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల సమావేశం
  • 3 మాసాల్లోగా న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు
  • సీఎంని కలిసి వినతిపత్రం అందజేస్తాం 

తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా ఇరవై వేల లోపు ఉన్న బకాయిలను చెల్లిస్తామని అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు గుర్తుచేశారు. విజయవాడలోని దాసరి భవన్ లో 13 జిల్లాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మూడు మాసాల్లోగా పదకొండు వందల ఎనభై కోట్లు విడుదల చేస్తామని తన పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారని అన్నారు. ఈ మేరకు ఓ వినతిపత్రంను జగన్ ని కలిసి అందజేయనున్నట్టు తెలిపారు. ముందుగా ఫ్యాక్స్, మెయిల్ ఐడీ ద్వారా జగన్ కు, హోం మంత్రి సుచరితకు తమ వినతిపత్రాలు పంపుతామని చెప్పారు.

More Telugu News