janasena: నాదెండ్ల మనోహర్ మా పార్టీని వీడుతున్నారన్నది అబద్ధం: జనసేన

  • ఇలాంటి వదంతులను నమ్మొద్దు
  • నాదెండ్ల మనోహర్ విదేశీ పర్యటనలో ఉన్నారు
  • ‘జనసేన’లోనే ఆయన కొనసాగుతారు

ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసిన రాపాక వరప్రసాద్ మినహా ఆ పార్టీ నుంచి ఎవరూ విజయం సాధించలేకపోయారు. తెనాలి నుంచి పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ కూ ఓటమి తప్పలేదు.ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి నాదెండ్ల మనోహర్ ‘గుడ్ బై’ చెప్పనున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఈ విషయమై జనసేన పార్టీ స్పందించింది. నాదెండ్ల మనోహర్ పార్టీ మారుతున్నారనే వార్తలను ఖండించింది. జనసేన పార్టీలోనే ఆయన కొనసాగుతున్నారని తెలిపింది. నాదెండ్ల మనోహర్ తో నేరుగా ఫోన్ లో మాట్లాడటం జరిగిందని, ఇతర ఏ రాజకీయ పార్టీలో చేరడంలేదని ఆయన స్పష్టం చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ తన కుటుంబసభ్యులతో కలసి విదేశీ పర్యటనలో ఉన్నారని పేర్కొంది. నాదెండ్ల అందుబాటులో లేని సమయంలో ఇలాంటి వదంతులు సృష్టించారని, ఇలాంటి వాటిని జనసైనికులు నమ్మొద్దని కోరింది. ఈ వారంలో నాదెండ్ల మనోహర్ తన పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకుంటారని జనసేన పార్టీ తెలిపింది.

More Telugu News