Roja: రోజాకు ఆర్టీసీ చైర్మన్ పదవి?

  • రోజా లేకుండానే జగన్ క్యాబినెట్
  • అందుబాటులో లేకుండా పోయిన రోజా!
  • విజయసాయిరెడ్డి మంతనాలు!

పాతికమందితో సీఎం జగన్ తన క్యాబినెట్ ప్రకటించాక, వైసీపీలో పైకి కనిపించకపోయినా చాలమంది అలకపాన్పులు ఎక్కినట్టు తెలుస్తోంది. చివరినిమషం వరకు మంత్రి పదవి ఖాయమని నమ్మిన రోజా లాంటి వాళ్లు హతాశులయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు. క్యాబినెట్ ప్రమాణస్వీకారంలో కూడా ఆమె కనిపించలేదు. అయితే, రోజాను బుజ్జగించేందుకు విజయసాయిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగినట్టు సమాచారం.

ఆర్టీసీ చైర్మన్ పదవికి నామినేట్ చేస్తామని ఆయన చెప్పగా, రోజా సంతృప్తి చెందినట్టు వినికిడి. అయితే, ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేపథ్యంలో, గెలిచిన అభ్యర్థులు ఇలాంటి నామినేటెడ్ పదవులు చేపట్టడంలో రాజ్యాంగపరమైన అడ్డంకులను వైసీపీ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి కూడా రోజా ముందు ఓ ఆప్షన్ లా ఉంచారని ప్రచారం జరుగుతోంది. మరి రోజా భవితవ్యం ఏ పదవితో ముడిపడి ఉందో కాలమే చెప్పాలి!

More Telugu News