cudupha: రెవెన్యూ సిబ్బందిపై దాడి...కడప జిల్లాలో ఇసుక మాఫియా దందా

  • గాయపడిన ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు
  • అడ్డుకునేందుకు వెళ్లిన వారిని ట్రాక్టర్‌తో ఢీకొట్టించిన వైనం
  • పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు సమాచారం

కడప జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిని ట్రాక్టర్‌తో ఢీకొట్టించిన ఘటనలో ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని సిద్దవటం మండలం ఎస్‌.రాజంపేట పరిధిలో పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో వీఆర్‌ఓ ఆరిఫ్‌, వీఆర్‌ఏ వెంకటపతి అడ్డుకునేందుకు వెళ్లారు.  ద్విచక్ర వాహనంపై వెళ్లిన వీరు ట్రాక్టర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా డ్రైవర్‌ వీరిని ఢీకొట్టి వెళ్లాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. బోల్తా పడిన ట్రాక్టర్‌ను వదిలేసి డ్రైవర్‌, మరో వ్యక్తి పరారయ్యారు. గాయపడిన రెవెన్యూ ఉద్యోగులను కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News