karthikeya: నాపై విమర్శలకు నటనతోనే చెక్ పెడతా: హీరో కార్తికేయ

  • చేసింది ఒక సినిమాయేగా అనుకుంటున్నారు
  •  చాలామందిని చూశాములే అని చెప్పుకుంటున్నారు
  •  సవాళ్లు విసిరే పనిపెట్టుకోలేదు 

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో తొలి హిట్ కొట్టేసిన కార్తికేయ, 'హిప్పీ'తో థియేటర్లకు వచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నేను సినిమాల్లోకి రావడం చూసి నవ్వుకున్న వాళ్లున్నారు .. ఇక్కడ నిలబడతాననే నమ్మకం లేని వాళ్లున్నారు. ఒక సినిమా చేసినంత మాత్రన అయిపోతుందా .. ఇంకో రెండు మూడు సినిమాలు చేయనీ ఏమౌతుందో చూద్దాం అనుకునేవాళ్లున్నారు.

ఓ.. ఇంతకు ముందు చాలామందే ఇండస్ట్రీకి వెళ్లారు .. ఇలాగే ఎగిరారు .. చూద్దాంలే అని అనుకుంటున్నారు. ఇలాంటి మాటలు నాకు వినిపిస్తూనే వున్నాయి. నేనేంటో నిరూపిస్తాను .. నా సత్తా చూపిస్తాను అంటూ నేను సవాళ్లు విసరను. నా నటనతోనే వాళ్లకి సమాధానం చెప్పాలనే పట్టుదలతో నవ్వేసి ఊరుకుంటున్నాను. అనుకున్నది సాధించిన తరువాత కూడా అలాంటివాళ్లను నవ్వుతూనే పలకరిస్తాను" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News