t-congress: ప్రతిపక్షాలు ఉండకూడదనే కేసీఆర్ ఆలోచన సరికాదు: వీహెచ్

  • ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి వైఖరి లేదు
  • ప్రజాస్వామ్యానికే ఇది వెన్నుపోటు
  • ప్రజలు ప్రశ్నించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీ-కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) మరోమారు విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం పేరుతో కాంగ్రెస్ నేతలు ఇందిరాపార్కు వద్ద దీక్షకు దిగారు. టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దీక్షకు టీడీపీ, తెలంగాణ జన సమితి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ఉండకూడదనే కేసీఆర్ ఆలోచనా తీరు సరికాదని విమర్శించారు. ప్రజాస్వామ్యానికే ఇది వెన్నుపోటు అని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి వైఖరి లేదని దుయ్యబట్టారు. పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నా, ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్ లో కలుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పార్టీ నుంచి గెలిచిన నేతలు, మరో పార్టీలో చేరడం సరికాదని అభిప్రాయపడ్డ వీహెచ్, ప్రజలు ప్రశ్నించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.  

More Telugu News