తల్లి పాత్రలో కనిపించనున్న శ్రియ

08-06-2019 Sat 11:41
  • తెలుగు .. తమిళ భాషల్లో శ్రియకి క్రేజ్
  • నాయిక ప్రాధాన్యత కథలవైపు మొగ్గు
  • చంద్రశేఖర్ యేలేటితో సెట్స్ పైకి 
వెండితెరపై సుదీర్ఘ కాలంగా కెరియర్ ను కొనసాగిస్తోన్న కథానాయికలలో శ్రియ ఒకరు. ఇటు తెలుగు .. అటు తమిళంలోను ఆమె ఇప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉండటం విశేషం. త్వరలో తెలుగులో ఆమె ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయనుందనేది తాజా సమాచారం.

విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా చంద్రశేఖర్ యేలేటికి మంచి పేరు వుంది. నాయిక ప్రాధాన్యత కలిగిన ఒక కథను సిద్ధం చేసిన చంద్రశేఖర్ యేలేటి, శ్రియకు వినిపించి ఒప్పించాడని అంటున్నారు. ఈ సినిమాలో పదేళ్ల పాపకు తల్లిగా శ్రియ కనిపిస్తుందని చెబుతున్నారు. గతంలో శ్రియ 'గౌతమీపుత్ర శాతకర్ణి' .. 'గోపాల గోపాల' సినిమాల్లో తల్లిపాత్రల్లో మెప్పించింది. ముందుగా ఈ సినిమాను పూర్తి చేసేసి, ఆ తరువాతనే నితిన్ తో కలిసి చంద్రశేఖర్ యేలేటి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.