surya: నా సినిమా ఫ్లాప్ అయింది.. ఫెయిల్యూర్ ని స్వీకరిస్తున్నా: హీరో సూర్య

  • సూర్య హీరోగా వచ్చిన 'ఎన్జీకే'
  • రెండు భాషల్లోను పరాజయం 
  • విమర్శకులకు థ్యాంక్స్ చెప్పిన సూర్య

సూర్య కథానాయకుడిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన 'ఎన్జీకే' మే 31వ తేదీన విడుదలైంది. రకుల్ .. సాయిపల్లవి కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తరువాత సెల్వరాఘవన్ చేసిన సినిమా కావడంతో, అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అయితే ఈ రెండు భాషల్లోను ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పరాజయం పాలైంది. తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ సూర్య ట్వీట్ చేశాడు. ఈ ఫెయిల్యూర్ ను స్వీకరిస్తున్నట్టుగా చెప్పాడు. సినిమాలోని లోపాలను ఎత్తి చూపిన విమర్శకులకు ధన్యవాదాలు తెలియజేశాడు. తన సినిమా ఫ్లాప్ అయిందని సూర్య నిజాయతీగా ఒప్పుకున్నందుకు అభిమానులు ప్రశంసిస్తున్నారు. 

More Telugu News