kerala: చల్లబడుతున్న దక్షిణాది.. మండిపోతున్న ఉత్తరాది

  • దేశంలో విచిత్ర పరిస్థితి
  • దక్షిణాదిలో ఇంకా కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు
  • మరికొన్ని గంటల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు

దేశంలో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. రుతుపవనాల రాకతో దక్షిణాదిలో భానుడి భగభగలు తగ్గి వాతావరణం చల్లబడగా, ఉత్తరాదిలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణం ఉంది. వేసవి వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉత్తరాదిలోని పలు ప్రాంతాలలో శుక్రవారం కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వారంలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఉత్తరాంధ్రతోపాటు ఒడిశా, జార్ఖండ్, బీహార్‌లలో మరికొన్ని రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొన్నారు. శుక్రవారం  మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవిలోనే అత్యధిక ఉష్ణోగ్రతతో రికార్డులకెక్కిన రాజస్థాన్‌లోని చురులో నిన్న 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. హరియాణాలోని భివానీ జిల్లాలో 43.1, చండీగఢ్‌లో 40, అమృత్‌సర్‌లో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  

More Telugu News