Andhra Pradesh: ఏపీకి ప్రత్యేక హోదాపై ఎవరు మాట్లాడినా ప్రయోజనం లేదు: కన్నా లక్ష్మీనారాయణ

  • మోదీని జగన్ అడగడంలో ఎటువంటి అభ్యంతరం లేదు
  • ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • ఈ నెల 9న తిరుపతికి మోదీ వస్తున్నారు

ఏపీకి ‘ప్రత్యేక హోదా’ అంశం ముగిసిన అధ్యాయంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభివర్ణించారు. తిరుపతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ అంశం గురించి ఎవరు మాట్లాడినా ప్రయోజనం ఉండదని అన్నారు. అయితే, ఈ అంశం విషయమై ప్రధాని మోదీని సీఎం జగన్ అడగడంలో ఎటువంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. ఈ నెల 9వ తేదీన ప్రధాని మోదీ తిరుపతికి వస్తున్నట్టు చెప్పారు. ఆరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు తిరుపతికి మోదీ చేరుకుంటారని, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం, తిరుమలకు బయలుదేరి వెళతారని అన్నారు. పద్మావతి గెస్ట్ హౌస్ లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళతారని వివరించారు. తొమ్మిదో తేదీ రాత్రి 8 గంటలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారని కన్నా పేర్కొన్నారు.

More Telugu News