paruchuri: ఒకే జోనర్లో వచ్చిన శోభన్ బాబు - కృష్ణ సినిమాలు హిట్ అయ్యాయి: పరుచూరి గోపాలకృష్ణ

  • 'ఖైదీ బాబాయ్' 25వారాలు ఆడింది
  •  'నేరము - శిక్ష' హిట్ అయింది
  •  అదే జోనర్లో వచ్చింది 'సమరసింహా రెడ్డి'

తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో 'క్రైమ్ అండ్ పనిష్మెంట్' జోనర్ నేపథ్యంలో వచ్చిన 'ఖైదీ బాబాయ్' .. 'నేరము - శిక్ష' సినిమాలను గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. తెలిసో తెలియకో ఒక నేరం చేసినప్పుడు అందుకు శిక్షగా బాధితులను ఆదుకోవడమనే కాన్సెప్టుతో తెలుగులో తొలిసారిగా 'ఖైదీ బాబాయ్' వచ్చింది.

ఇది ఎంత అద్భుతమైన జోనర్ అంటే .. ఈ సినిమా 25వారాలు ఆడేసింది. ఈ సినిమా తరువాత ఇదే జోనర్లో కృష్ణ కథానాయకుడిగా 'నేరము - శిక్ష' వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. 'సమరసింహా రెడ్డి' సినిమాలోను ఇదే జోనర్ ను టచ్ చేయడం జరిగింది. తాను చేసిన నేరానికి శిక్షగా హీరో అన్నింటినీ వదిలేసుకొని వచ్చేసి కష్టపడతాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News