Deepika Padukone: దీపికా పదుకొనే 'చపాక్' రిలీజ్ డేట్

  • తెరపైకి యాసిడ్ బాధితురాలి కథ
  •  టైటిల్ గా 'చపాక్'
  • జనవరి 10న విడుదల

ఇటీవల కాలంలో యథార్థ సంఘటనల ఆధారంగా బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు రూపొందుతున్నాయి. అలా రూపొందుతోన్న సినిమానే 'చపాక్'. ఢిల్లీ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇటీవలే షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.

ఈ సినిమాకి దీపికా పదుకొనె కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం విశేషం. తాజాగా దీపికా పదుకొనె ఈ సినిమాను గురించి స్పందిస్తూ, 'ఇది నా కెరియర్లో అత్యుత్తమమైన సినిమా .. జనవరి 10 .. 2020న ఈ సినిమాను చూడొచ్చు' అని చెప్పారు. దీపికా పదుకొనే అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలోని పాత్ర ఆమె కెరియర్లో చెప్పుకోదగినది అవుతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News