YSRCP: ఐదుగురు డిప్యూటీ సీఎంలు... జగన్ సంచలన నిర్ణయం!

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాలకు చాన్స్
  • దేశం యావత్తూ ఏపీ వైపు చూడాలి
  • రెండున్నరేళ్ల తరువాత కేబినెట్ లో మార్పులుంటాయన్న జగన్

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా ఆయన నియమించనున్నారు. దేశం యావత్తూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి డిప్యూటీ సీఎంలుగా నియమిస్తానని ఈ ఉదయం జరిగిన పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో జగన్ ప్రకటించారు. రెండున్నరేళ్ల తరువాత కేబినెట్ లో మార్పులు ఉంటాయని, అప్పుడు కొత్త మంత్రులు వస్తారని ఆయన అన్నారు. ఈ రెండున్నరేళ్లూ మంత్రుల పనితీరును తాను గమనిస్తుంటానని, సంక్షేమం అమలు, అభివృద్ధిలో నిర్లక్ష్యం చూపిన వారికి పదవులు దూరమవుతాయని హెచ్చరించారు. శనివారం నాడు 25 మంది మంత్రులతో పూర్తిస్థాయిలో క్యాబినెట్ ఏర్పాటవుతుందని జగన్ స్పష్టం చేశారు. మొత్తం మంత్రుల్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉంటారని అన్నారు.  వైసీపీ ఎల్పీ సమావేశం కొనసాగుతోంది.

More Telugu News