ayodya: అయోధ్యలో ఏడు అడుగుల శ్రీరాముని రోజ్‌వుడ్‌ విగ్రహం.. నేడు ఆవిష్కరించనున్న సీఎం ఆదిత్యనాథ్‌

  • మధ్యాహ్నం 2.30 గంటలకు ముహూర్తం
  • కర్ణాటకలో రూ.35 లక్షలు వెచ్చించి విగ్రహం  కోసం రోజ్ వుడ్ కొనుగోలు
  • శోధ్‌సంస్థాన్‌ మ్యూజియంలో విగ్రహం

అయోధ్యలో పూర్తి రోజ్‌ వుడ్‌తో తయారు చేసిన ఏడు అడుగుల కోదండరాముని విగ్రహాన్ని ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఆవిష్కరించనున్నారు. అయోధ్యలోని శోధ్‌సంస్థాన్‌ మ్యూజియంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కర్ణాటక స్టేట్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాప్ట్స్‌ ఎంపోరియం నుంచి మేలు రకమైన రోజ్‌వుడ్‌ను రూ.35 లక్షలతో కొనుగోలుచేసి ఈ విగ్రహం కోసం ఉపయోగించారు. రాముడి ఐదు అవతారాల్లో ఒకటైన కోదండరాముని విగ్రహాన్ని మ్యూజియంలో ఉంచనున్నారు. ఈ మ్యూజియంలో రాముని గురించి తెలిపే పలుచారిత్రక ఘట్టాలకు చెందిన 2,500 చిత్రాలు, కళారూపాలు ఉన్నప్పటికీ కోదండరాముని గురించి వర్ణించే ఆనవాళ్లు లేవు. ఈ కారణంగానే ఈ విగ్రహాన్ని మ్యూజియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

More Telugu News