Sidiri Appalaraju: చిన్నప్పుడు చంద్రబాబుతో సత్కారం... ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో!

  • 1995 పది పరీక్షల్లో థర్డ్ ర్యాంక్
  • సీఎం చేతుల మీదుగా సన్మానం పొందిన సీదిరి అప్పలరాజు
  • నేడు పలాస నుంచి ఎమ్మెల్యేగా విజయం

అది 1995. టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అప్పటి సీఎం చంద్రబాబునాయుడు సన్మానించారు. అప్పట్లో అప్పలరాజు అనే విద్యార్థి మూడవ ర్యాంకులో నిలిచాడు. చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకుని మురిసిపోయాడు. అప్పటి ఆ బాలుడు నేడు ఎమ్మెల్యే.. అతనే సీదిరి అప్పలరాజు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పలాస నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. నాటి ర్యాంకర్ నేడు ఎమ్మెల్యే కావడంతో ఆ పాత చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News