Karnataka: వర్షాల కోసం ప్రార్థించండి.. ఆలయాలకు ఆదేశాలు జారీచేసిన కర్ణాటక ప్రభుత్వం

  • తాగునీటి కోసం అల్లాడిపోతున్న కర్ణాటక
  • వెంటనే పూజలు ప్రారంభించాలంటూ ఆలయాలకు ఆదేశాలు
  • మండిపడుతున్న హేతువాదులు

తీవ్ర కరవుతో అల్లాడిపోతున్న కర్ణాటక వాన చినుకు కోసం అల్లాడిపోతోంది. రుతుపవనాల కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుని, రాష్ట్రంలోని వందలాది ఆలయాలకు ఆదేశాలు జారీ చేసింది. వరుణదేవుడి కరుణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇందుకోసం విరాళాల పెట్టె నుంచి 10,001 రూపాయలు తీసుకుని ఉపయోగించుకోవచ్చంటూ అనుమతి ఇచ్చింది.

కర్ణాటకలో ఇప్పుడు తాగునీటి కోసం తీవ్ర కటకట ఏర్పడింది. రాష్ట్రంలోని 176 తాలుకాల్లో 156 తాలుకాలను కరవు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వరుణ దేవుడి కటాక్షాల కోసం వెంటనే అవసరమైన పూజలు ప్రారంభించాలని ఆదేశించింది. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై హేతువాదులు మండిపడుతున్నారు. పూజలు చేస్తే వర్షాలు పడవని, ఆ పేరుతో ప్రజాధనాన్ని వృథా చేయవద్దని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News