amaravathi: నిలిచిపోయిన వైకుంఠపురం బ్యారేజీ పనులు: ఏపీ కొత్త ప్రభుత్వం సర్క్యులర్‌ ఎఫెక్ట్‌

  • రూ.2,169 కోట్ల పనులు దక్కించుకున్న నవయుగ సంస్థ
  • కార్మికులకు సెలవు ఇచ్చిన నిర్మాణ సంస్థ
  • యంత్రాలను కూడా వెనక్కి పంపిన అధికారులు

గుంటూరు జిల్లా అమరావతి మండలం పరిధిలో కృష్ణా నదిపై 2,169 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణ పనులకు బ్రేక్‌ పడింది. నీటిపారుదల శాఖ పనులపై జగన్‌ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం జారీచేసిన తాజా సర్క్యులర్‌ ప్రభావం ఈ పనులపై పడింది.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నీటి అవసరాల కోసం 10 టీఎంసీల సామర్థ్యంతో ప్రకాశం బ్యారేజీకి ఎగువన 30 కిలోమీటర్ల దూరంలో చేపట్టతలపెట్టిన ఈ బ్యారేజీ పనులకు ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఈ పనులను నవయుగ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. అయితే ఏప్రిల్‌ ముందు టెండర్‌ అయిన పనులను పునఃసమీక్షించాలని కొత్త ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేయడంతో సంస్థ పనులను నిలిపివేసింది. కార్మికులకు సెలవులిచ్చి పంపేసింది. యంత్రాలను కూడా బ్యారేజీ ప్రాంతం నుంచి తరలించింది.

More Telugu News