Telangana: తెలంగాణ సీఎంకు లేఖ రాసి బ్యాలెట్ బాక్స్ లో వేసిన 'బీర్' బాబు!

  • తాగడానికి కింగ్ ఫిషర్ బీర్ లు దొరకడం లేదు
  • పక్క జిల్లాకు వెళ్లాల్సి వస్తోంది
  • వైరల్ అవుతున్న లేఖ

ఈ ఎండాకాలంలో తాగడానికి కింగ్ ఫిషర్ బీర్ లు దొరకడం లేదని, వాటిని తమ ప్రాంతానికి సరఫరా చేయించాలని కోరుతూ, ఓ మందుబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖరాశాడు. అంతేకాదు, దాన్ని పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్ లో వేశాడు. ఆ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జగిత్యాల సమీపంలోని రాయికల్ మండలం, మూటపల్లి గ్రామం ఓట్లను లెక్కిస్తున్న వేళ, బ్యాలెట్ బాక్స్ నుంచి ఈ లేఖ బయటపడింది. తమ జిల్లాను తిరిగి కరీంనగర్ లో కలపాలని, అప్పుడే తమకు బీర్ లు దొరుకుతాయని కూడా అతను సలహా ఇచ్చాడు. బీర్ల కోసం తాము పక్క జిల్లాకు వెళ్లిరావాల్సి వస్తోందని వాపోయాడు. ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇది చదివి తెగ నవ్వుకుంటున్నారు.  

More Telugu News