Anju Ghosh: బీజేపీలో చేరిన బంగ్లాదేశ్ నటి!

  • కోల్ కతాకు వచ్చిన అంజు ఘోష్
  • పార్టీలో చేర్చుకున్న బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు
  • సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన

ప్రముఖ బంగ్లాదేశ్‌ నటి, 1980 దశకంలో దేశ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన 'బెడెర్ మెయ్ జోస్నా' హీరోయిన్ అంజు ఘోష్‌ బీజేపీలో చేరారు. కోల్ కతాలో పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ సమక్షంలో ఆమె కాషాయ కండువాను కప్పుకున్నారు. ఆపై మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. గతంలో పలు బెంగాలీ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న అంజు ఘోష్, బంగ్లాదేశీయురాలుగా కొనసాగుతున్నారా? లేక భారత పౌరసత్వం తీసుకున్నారా? అన్న విషయమై ఆమె స్పష్టత ఇవ్వలేదు.

కాగా, అంజు బీజేపీలో చేరడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. ఆమెను పార్టీలో ఎలా చేర్చుకుంటారని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆమె ఏ దేశానికి చెందిన వారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి లోక్‌ సభ ఎన్నికల ప్రచార వేళ, ఓ బంగ్లాదేశీ నటుడు ప్రచారం చేయగా, అతన్ని, ఇండియా నుంచి పంపేసిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ తరఫున ప్రచారం చేసేందుకు ప్రముఖ నటుడు ఫెర్డోస్‌ అహ్మద్‌ ఇండియాకు రాగా, కేంద్ర హోమ్ శాఖ అతని వీసాను రద్దు చేసి, తక్షణం దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అతను మరోసారి ఇండియాకు రాకుండా బ్లాక్ లిస్ట్ లోనూ పెట్టింది.

More Telugu News