Monsoon: కేరళను తాకనున్న రుతుపవనాలు.. ఎల్లుండి నుంచి వర్షాలే

  • ఈ నెల 1నే తాకాల్సిన రుతుపవనాలు
  • 8న కేరళను తాకి క్రమంగా విస్తరించనున్న వైనం
  • దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భానుడి ప్రతాపం

రుతుపనాల రాక మరోవారం ఆలస్యం కానున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. నిజానికి ఈ నెల 1నే రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉందని ఐఎండీ తెలిపింది. అయితే, వారం రోజులు ఆలస్యమయ్యాయని, ఈ నెల 8న కేరళను తాకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంది.  అదే జరిగితే క్రమంగా అవి ఉత్తరంవైపుగా పయనించి దేశం మొత్తం విస్తరిస్తాయని వివరించింది.

 ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా జూన్ 4-7 మధ్య రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ 6 నాటికి నాలుగు రోజులు అటూఇటుగా రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని గత నెలలో ఐఎండీ అధికారులు తెలిపారు. కాగా, దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్‌లోని చురులో 50 డిగ్రీలు కూడా దాటిపోయింది. వాతావరణ శాఖ చెప్పినట్టు ఎల్లుండి కనుక రుతుపవనాలు కేరళను తాకితే వాతావరణం కొంత చల్లబడే అవకాశం ఉంది.

More Telugu News