Uttarakhand: అమెరికాలో చికిత్స పొందుతూ ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి కన్నుమూత

  • గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న పంత్
  • చికిత్స కోసం మే చివరిలో అమెరికాకు
  • మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం

గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఉత్తరాఖండ్ ఆర్థికశాఖ మంత్రి ప్రకాశ్ పంత్ తుదిశ్వాస విడిచారు. అమెరికాలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారమే మృతి చెందారు. ఆయన మృతికి సంతాపంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. అలాగే, నేడు సెలవు ప్రకటించింది. పంత్ మే నెల చివరిలోనే చికిత్స కోసం అమెరికా వెళ్లారు.

అంతకంటే ముందు ఢిల్లీలోని రోహిణి ఆసుపత్రిలో దీర్ఘకాలం పాటు ఆయన చికిత్స పొందారు. ఈ కారణంగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొనలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రసంగం చదువుతున్న సమయంలో పంత్ రెండు సార్లు కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి ఎమ్మెల్యేలు ఆయనను పైకి లేపారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల తర్వాత పంత్ ముఖ్యమంత్రి రేసులోనూ ఉన్నారు. అయితే, చివరికి త్రివేంద్రసింగ్ రావత్‌ సీఎం కాగా, పంత్ ఆర్థిక శాఖతో సరిపెట్టుకున్నారు.

More Telugu News