Police: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు

  • నిన్న ఐఏఎస్ లకు స్థానచలనం
  • జగన్ సర్కారు రాకతో బదిలీలు వేగవంతం
  • ఉన్నతస్థాయిలో నియామకాలపై సీఎం జగన్ దృష్టి

ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చాక అధికారుల బదిలీలు ఆగమేఘాలపై జరిగిపోతున్నాయి. నిన్న భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పించిన ఏపీ సర్కారు, ఇవాళ ఐపీఎస్ లపై దృష్టిసారించింది. ఈ క్రమంలో, కర్నూలు రేంజ్ డీఐజీగా టి.వెంకట్రామిరెడ్డి, ఏలూరు రేంజ్ డీఐజీగా ఏఎస్ ఖాన్, సీఐడీ డీఐజీగా త్రివిక్రమ్ వర్మ, ఆక్టోపస్ దళాల ఎస్పీగా విశాల్ గున్షిలను నియమించారు

స్థానచలనం పొందిన అధికారుల జాబితా

  • టి.వెంకట్రామిరెడ్డి -కర్నూలు రేంజ్ డీఐజీ
  • ఏఎస్ ఖాన్ -ఏలూరు రేంజ్ డీఐజీ
  • త్రివిక్రమవర్మ -సీఐడీ డీఐజీ
  • విశాల్ గున్ని -ఆక్టోపస్ ఎస్పీ
  • అశోక్ కుమార్ - ఇంటెలిజెన్స్ ఎస్పీ
  • సర్వశ్రేష్ట త్రిపాఠి -సీఐడీ ఎస్పీ
  • రవిప్రకాశ్ -ఎస్ఐబీ ఎస్పీ
  • రాహుల్ దేవ్ శర్మ -గ్రేహౌండ్స్
  • కోయ ప్రవీణ్ - రైల్వే ఎస్పీ
  • ఘట్టమనేని శ్రీనివాస్ -అనంతపురం పీటీసీ
  • ఏఆర్ దామోదర్ -హెడ్ క్వార్టర్స్
  • భాస్కర్ భూషణ్ -హెడ్ క్వార్టర్స్
  • ఎస్వీ రాజశేఖర్ బాబు -హెడ్ క్వార్టర్స్
  • నవదీప్ సింగ్ -పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ
  • సీహెచ్ వెంకటప్పలనాయుడు -చిత్తూరు జిల్లా ఎస్పీ
  • అమ్మిరెడ్డి -శ్రీకాకుళం ఎస్పీ
  • విక్రాంత్ పాటిల్ -విశాఖ డీసీపీ1
  • ఉదయ్ భాస్కర్ బిల్లా -విశాఖ డీసీపీ2
  • బీహెచ్ పీ రామకృష్ణ -గుంటూరు జిల్లా ఎస్పీ
  • జయలక్ష్మి -గుంటూరు రూరల్ ఎస్పీ
  • బి.రాజకుమారి -విజయనగరం జిల్లా ఎస్పీ
  • నయీం హష్మీ - తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ
  • బి.సత్య ఏసుబాబు -అనంతపురం
  • సీహెచ్ విజయరావు -విజయవాడ డీసీపీ2
  • నాగేంద్రకుమార్ -విజయవాడ జాయింట్ సీపీ

More Telugu News