Bhadrachalam: భద్రాచలాన్ని ఏపీలో విలీనం చేసేందుకు సన్నాహాలు.. అంగీకరించిన కేసీఆర్?

  • కేసీఆర్, జగన్‌ల భేటీలో అంగీకారం
  • 2014లోనే పోలవరం ముంపు మండలాల విలీనం
  • విలీన విషయంలో కేంద్రం కూడా సానుకూలం

తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలాన్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయనున్నారనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. ఇటీవల రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ భేటీల నేపథ్యంలో ఈ విషయం చర్చకు రాగా, కేసీఆర్ అందుకు అంగీకరించినట్టు సమాచారం.

ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలు 2014లో ఏపీలో విలీనమైన విషయం తెలిసిందే. ఇప్పుడు భద్రాచలాన్ని ఏపీలో విలీనం చేసే విషయంలో కేంద్రం కూడా సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News