India: సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహం గురించి వెలుగు చూసిన కళ్లు చెదిరే వాస్తవాలు!

  • ఎన్నికల ఖర్చు మొత్తం రూ.60 వేల కోట్లు
  • ఖర్చులో బీజేపీదే అగ్రస్థానం
  • ఒక్కో ఓటరుపై రూ.700 వ్యయం
  • 1998 - 2019 మధ్య ఆరు రెట్లు పెరిగిన ఖర్చు

భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ధన ప్రవాహం గురించి కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 17వ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ధన ప్రవాహం రికార్డ్ స్థాయిలో జరిగిందని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. ఇప్పటికే ప్రాథమిక అంచనా ప్రకారం ఎన్నికల వ్యయం రూ.60 వేల కోట్లని తేలింది. 2014 ఎన్నికలకు ఇది రెట్టింపు అని తెలిసింది.

తాజాగా చేసిన అధ్యయనంలో ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందనే విషయాలను కూడా సీఎంఎస్ వెల్లడించింది. ఈ మొత్తం ఖర్చులో బీజేపీదే అధిక మొత్తం అని తేలింది. బీజేపీ ఎన్నికల వ్యయం 45 శాతం కాగా, కాంగ్రెస్ వాటా 40 శాతమని తేలింది. పార్టీలన్నీ కలిపి ఒక్కో ఓటరుపై రూ.700 వ్యయం చేశాయి. 1998 - 2019 మధ్య ఎన్నికల ఖర్చు ఆరు రెట్లు పెరగడం విశేషం. 1998లో రూ.9 వేల కోట్లు ఖర్చు కాగా, ప్రస్తుతం అది దాదాపు 60 వేల కోట్లకు చేరుకుంది. 1998లో ఎన్నికల ఖర్చులో బీజేపీ 20 శాతం ఖర్చు చేసింది. 2019లో అది 45 శాతానికి చేరుకుంది.

More Telugu News