karthikeya'digangana: నా కల నిజం చేసిన సినిమా 'హిప్పీ': హీరో కార్తికేయ

  • రేపు థియేటర్లకు రానున్న 'హిప్పీ'
  • యూత్ కి నచ్చే కథాకథనాలు 
  • ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే సినిమా

కార్తికేయ కథానాయకుడిగా టీఎన్ కృష్ణ రూపొందించిన 'హిప్పీ' సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దిగాంగన కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జేడీ చక్రవర్తి ఒక కీలకమైన పాత్రను పోషించాడు.

తాజాగా హీరో కార్తికేయ మాట్లాడుతూ, " పూర్తిగా యూత్ ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను రూపొందించడం జరిగింది. 'ఆర్ ఎక్స్ 100' మాదిరిగానే ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అవుతుందనే నమ్మకం వుంది. తెరపై డిఫరెంట్ లుక్స్ తో కనిపించడం .. డాన్సులు చేయడం .. ఫైట్స్ చేయడం నాకు చాలా ఇష్టం. అవన్నీ ఈ సినిమాలో వున్నాయి. ఈ సినిమా చేయడానికి ఇదో కారణం. మూడవ సినిమాతోనే నా కల నిజమైనందుకు నాకు చాలా సంతోషంగా వుంది. ఈ సినిమా చూస్తూ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News