taapsee: అత్యధిక థియేటర్లలో 'గేమ్ ఓవర్' మూవీ

  • తెలుగు .. తమిళ భాషల్లో 'గేమ్ ఓవర్'
  • హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
  •  ఈ నెల 14వ తేదీన విడుదల  

తాప్సీ  ప్రధాన పాత్రగా తెలుగు .. తమిళ భాషల్లో 'గేమ్ ఓవర్' నిర్మితమైంది. ఈ రెండు భాషల్లోనూ ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక హిందీలోను తాప్సీకి మంచి క్రేజ్ ఉండటం వలన, బాలీవుడ్ లోను ఈ సినిమాను ఇదే రోజున విడుదల చేయనున్నారు.

ఈ మూడు భాషల్లోను కలుపుకుని 1200 స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. శశికాంత్ - చక్రవర్తి రామచంద్ర నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. గతంలో తాప్సీ చేసిన హారర్ థ్రిల్లర్ చిత్రాలు విజయాలను అందుకున్నాయి. ఆ సినిమాల్లో ఆమె నటనకు ప్రశంసలు కూడా లభించాయి. మరి ఈ సినిమాతో ఒకేసారి 3 భాషల్లో తాప్సీ హిట్ కొడుతుందేమో చూడాలి. 

More Telugu News