kamal: 'భారతీయుడు 2' నుంచి కాజల్ తప్పుకోలేదట

  • సెట్స్ పై 'భారతీయుడు 2'
  • జయం రవి జోడీగాను కాజల్
  •  టైటిల్ గా 'కోమలి'

శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా 'భారతీయుడు 2' సెట్స్ పైకి వెళ్లింది. కమల్ పై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఆ తరువాత షూటింగు ఆలస్యమవుతూ వస్తోంది. దర్శక నిర్మాతల మధ్య మనస్పర్థలు వచ్చినట్టుగా వార్తలు షికారు చేశాయి.

ఈ నేపథ్యంలో ఇలా షూటింగు వాయిదా పడుతూ వుంటే, ఇతర ప్రాజెక్టులకి తాను ఇచ్చిన డేట్స్ లో తేడాలు వచ్చేస్తాయని భావించిన కాజల్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందనే వార్త జోరుగా షికారు చేస్తోంది. అయితే ఇదంతా కేవలం పుకారు మాత్రమేననీ, కాజల్ ఈ సినిమా చేస్తోందనేది కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాతో పాటు తమిళంలో ఆమె మరో సినిమా కూడా చేస్తోంది. జయం రవి కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాకి 'కోమలి' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

More Telugu News