Guntur District: గుంటూరు జిల్లాలో 1000 ఏళ్ల నాటి పురాతన విగ్రహం లభ్యం

  • మాచర్ల సమీపంలో జైన తీర్థంకర విగ్రహం వెలికితీత
  • 11వ శతాబ్దం నాటిదిగా భావిస్తున్న వైనం
  • కల్యాణి చాళుక్య శైలిలో ఉన్న విగ్రహం

విజయవాడ, అమరావతి సాంస్కృతిక కేంద్రం (సిసీవీఏ) ఓ ప్రాచీన విగ్రహాన్ని కనుగొంది. గుంటూరు జిల్లాలోని మాచర్ల పట్టణం సమీపంలో 1000 ఏళ్ల నాటి విగ్రహాన్ని వెలికితీశారు. ఇది ఏడో జైన తీర్థంకర సుపార్శ్వనాథ  విగ్రహంగా భావిస్తున్నారు. ఈ విగ్రహం కల్యాణి చాళుక్య శైలిలో కనువిందు చేస్తోంది. ఇది 11వ శతాబ్దానికి చెందిన విగ్రహంగా భావిస్తున్నట్టు సీసీవీఏ సీఈఓ శివనాగిరెడ్డి వివరించారు. శైవ, వైష్ణవ ప్రాబల్య ప్రాంతమైన మాచర్లలో జైన మత ఆధారాలు లభ్యం కావడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News